టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడు మీదున్నాడు బాలయ్య. ఈ సీనియర్ హీరోకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ సారి యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆ యువ దర్శకుడెవరో తెలుసా…? ఛలో, భీష్మ చిత్రాల సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు వెంకీ కుడుముల. బాలకృష్ణను ఇటీవలే కలిసిన ఈ డైరెక్టర్ ఓ కథను వినిపించాడని, ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో స్టోరీకి బాలకృష్ణ ఓకే చెప్పాడని టాలీవుడ్ సర్కిల్ టాక్.
ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న అఖండ షూటింగ్ చివరి దశలో ఉంది. హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్.