తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ‘‘ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోంది. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను.
మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలి. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధంగా ఉన్నాను. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈటల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను’’ అని గంగుల వ్యాఖ్యానించారు.