తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది.
కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు భీమ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ ఈయన సమక్షంలోనే జరిగింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. హిందూ దేవతలను కించపరిచేలా ఈ ప్రతిజ్ఞ చేశారని విమర్శలొచ్చాయి.