ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .పారిశుధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్స్, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, గుర్తించి చేయాల్సిన పనులు, మిషన్ భగీరథ, తదితర పనులపై జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్, మున్సిపల్, అటవీ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో సమీక్షించారు.మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు, అదనపు కలెక్టర్ లు స్నేహాలత గారు, మధుసూదన్ గారు, అనురాగ్ జయంతి గారు, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి గారు, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.
