భారత్‌లో కొవిషీల్డ్‌గా వ్యవహరించే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్‌తో వైరస్ నుంచి జీవితకాలం పూర్తి రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలను తగినంత అభివృద్ధి చేయడంతో పాటు నూతన వేరియంట్లను సైతం వెంటాడి చంపేలా శరీరంలో శిక్షణా శిబిరాలను సృష్టిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.
యాంటీబాడీలు అంతరించినా కీలక టీసెల్స్‌ను శరీరం తయారుచేస్తుందని, ఇది జీవితకాలం సాగుతుందని జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన కధనంలో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు .ఆక్స్‌ఫర్డ్, జేఅండ్‌జే వంటి అడెనోవైరస్ వ్యాక్సిన్లు టీసెల్స్‌ను కాపాడే కీలక ఫీచర్‌ను కలిగిఉన్న సంగతి తెలిసిందే.
ఆక్స్‌ఫర్డ్ టీకా తీసుకున్న వ్యక్తి శరీరంలోని శిక్షణా శిబిరాల నుంచి తయారయ్యే టీసెల్స్ అత్యధిక ఫిట్‌నెస్ కలిగిఉంటాయని వెల్లడైనట్టు స్విట్జర్లాండ్‌లోని కంటోనల్ దవాఖానకు చెందిన పరిశోధకులు బుర్ఖద్ లుడెవిగ్ తెలిపారు. కాగా ఫైజర్, మోడెర్నా వంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ టీసెల్స్‌ను ప్రేరేపించడంలో సమర్ధవంతంగా పనిచేస్తుందని గతంలోనూ పలు అధ్యయనాలు వెల్లడించాయి.