ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మరణాల సంఖ్య 4.14 లక్షలకు చేరింది. అత్యధికంగా కేరళలో 13,956 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 9 వేల కేసులతో రెండోస్థానంలో ఉంది. 24 గంటల్లో కేసుల సంఖ్య 995 తగ్గింది. ఇక దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 40.64 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.