తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఎంపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కొన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి లక్ష్మీ బరాజ్ వరకు 22 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ ఉంది.
ఈ బ్యాక్ వాటర్‌లో వాటర్ ఫ్రంట్ నైట్ లైఫ్, క్రూజ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, గ్లైడింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ మొదలైన ప్రాంతాలు కూడా పర్యటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టి సారించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.