నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు అన్నారు. శనివారం కేసముద్రం లోని తెరాస పార్టీ ఆఫీస్ లో కేసముద్రం మండలానికి చెందిన 08 మంది లబ్ధిదారులకు గాను రూ.2,31,000 /- (రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ) విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మర్రి రంగా రావు, నారాయణ రావు, చంద్ర మోహన్, రావుల శ్రీనాథ్ రెడ్డి, నజీర్ అహ్మద్, కముటాం శ్రీను, మోడెం రవీందర్, రవీందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.