క్యారెట్ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. క్యారెట్ గుండెకు చాలా మంచిదట. క్యారెట్ రెగ్యులర్గా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని తేలింది.
క్యారెట్లో పుష్కలంగా ఉండే కెరోటిన్.. శరీరంలోకి విటమిన్ Aగా మార్పు చెందుతుంది. ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృద్ధి చెందకుండా క్యారెట్ చేస్తుందని నిర్ధారించారు.