దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు.
అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.