తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు.
శనివారం ఆయన ఎంపీ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి తిరిగి వస్తుండగా, ఆరెపల్లి వద్ద ఒక యువకుడు ప్రమాదంలో గాయపడి, రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు.
వెంటనే తన వాహనం ఆపి, ఎస్కార్ట్ వాహనంలోనే బాధితుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వివరాలు తెలుసుకొని సాయం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఎంజీఎం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.