తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్, మైనారిటీ నాయకులు తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు