అప్పట్లో కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇప్పుడు షకీలా నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్
పేర్లు ఖరారు చేశారు.
వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ గా నటిస్తుంది.రామానాయుడు స్టూడియోలో రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. రమేష్ చెప్పిన స్క్రిప్ట్స్ నాకెంతో నచ్చాయి.
‘‘ఈ రెండు చిత్రాల్లో నా కూతురు మిలా హీరోయిన్‌గా నటిస్తోంది. గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నాం. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కె. ఆర్ డిజిటల్ ప్లెక్స్ పేరుతో సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ద్వారా అనేక సినిమాలు చేస్తూ ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము అని అన్నారు.