తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్. రమణకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.
తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు.