నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హాలియా, సాగర్ మున్సిపాలిటీల అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున అదనంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరారు.
అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్, మినీ స్టేడియానికి నిధులను కేటాయించాల్సిందిగా విన్నవించారు. ఎమ్మెల్యే భగత్ విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. దీనిపై భగత్ స్పందిస్తూ కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.