బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది.
ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.