ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియన్ టీమ్‌లో కలకలం రేగింది. 23 మంది క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత 20 రోజుల బ్రేక్ దొరకడంతో ఈ గ్యాప్‌లో ప్లేయర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు.
అప్పుడే సదరు ప్లేయర్ కొవిడ్ బారిన పడ్డాడు. గురువారం టీమంతా డర్హమ్ వెళ్లనుండగా.. ఆ ప్లేయర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్లడం లేదు. యూకేలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యే బీసీసీఐ సెక్రటరీ జే షా ఇండియన్ టీమ్ సభ్యులకు మెయిల్ పంపించడం గమనార్హం.
డర్హమ్‌లో టీమిండియా మరోసారి బయోబబుల్‌లోకి వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆగస్ట్ 4న ప్రారంభమవుతుంది. ఒక ప్లేయర్ కరోనా బారిన పడిన మాట నిజమే. అయితే అతనికి పెద్దగా లక్షణాలేమీ లేవు.
ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. టీమ్‌తో కలిసి డర్హమ్ వెళ్లడం లేదు అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి వెల్లడించారు. ఆ ప్లేయర్ పేరు మాత్రం ఎవరూ బయటపెట్టలేదు. అయితే అతడు డెల్టా వేరియంట్ బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి.