దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు 4,11,989 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,130 మంది కొత్తగా డిశ్చార్జీకాగా, 581 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.