పరిపాలన సౌలభ్యం కొరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కార్పొరేటర్లు ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సి.ఎం.కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కె టి ఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,వరంగల్ (తూర్పు) శాసన సభ్యులు నన్నపు నేని నరేంధర్,వర్ధన్నపేట శాసన సభ్యులు అరూరి రమేష్,పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి,స్టేషన్ ఘన్పూర్ శాసన సభ్యులు డా.తాటి కొండ రాజయ్య గార్లకు కూడా ఈ సందర్భంగా మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీని నిలుపుకొన్న మహా నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు.ప్రజలకు సౌకర్యార్ధం, చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన హన్మకొండ, వరంగల్ జిల్లాల సమగ్ర అభివృద్ధి కొరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు.
చరిత్రాత్మక హన్మకొండ, వరంగల్ నగరాలకు విశిష్టత ఉందని, కాకతీయులు, రాణి రుద్రమదేవి పరిపాలించిన ఈ నగరాల విశిష్టత ను కాపాడుతూ రెండు నగరాలు విద్య, వైద్య, పర్యాటక, ఆధ్యాత్మిక పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందించడం కోసంసీఎం కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.కొత్తగా ఏర్పడబోయే హనుమకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉంటాయని, వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉంటాయని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయ లక్ష్మి సురేందర్, మరుపల్ల రవి, సిరంగి సునీల్, ఆవాల రాధికారెడ్డి, ఆకులపల్లి మనోహర్,వేముల శ్రీనివాస్,డా.ఇండ్ల నాగేశ్వర్ రావు,అభినవ్ భాస్కర్, ఎలుకంటి రాములు,నెక్కొండ కవిత కిషన్, జక్కుల రజిత, సుంకరి మనీషా శివకుమార్, జన్ను శిభారాణి అనిల్, మాజీ కార్పొరేటర్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.