సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేశారు.
నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే కేబినెట్‌కు పల్లె, పట్టణ ప్రగతిపై పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు నివేదికలు సమర్పించాయి.
రాష్ట్రంలో వైకుంఠధామాలను వందకు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై గ్రామాల్లో వీధి దీపాల కోసం ప్రత్యేకంగా మూడో వైర్‌ను తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది.