కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని న్యూ లాల్ బహదూర్ నగర్ లో నూతనంగా చేపడుతున్న అభయాంజనేయ స్వామి ఆలయ స్లాబ్ పునః నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటాని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బస్వరాజు, జేమ్స్, వెంకటేష్ గౌడ్, ప్రసాద్ గుప్త, ప్రభాకర్ గుప్త, శేఖర్ రావు, వహీద్, సంతోష్, రాజు, హనుమంతు, ప్రవీణ్, సాయి కుమార్, కిషోర్, జ్యోతి, ప్రభ, కవిత, శాంతి, స్వరూప పాల్గొన్నారు.