గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 41 వేలుగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. ఇంకా యాక్టివ్ కేసులు 4 లక్షలు ఉన్నాయి. వైరస్ బారిన పడి చనిపోయినవారి సంఖ్య 4,11,408గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.