ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు.
దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా రావు.