Home / SLIDER / రేపే తెలంగాణ మంత్రి మండలి సమావేశం

రేపే తెలంగాణ మంత్రి మండలి సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం అయింది.ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఆదివారం ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

32 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు ఆర్థికశాఖకు అందించారు. ఆ వివరాలను ఆర్థికశాఖ మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచనున్నది. 50 వేల ఉద్యోగాలను భర్తీచేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై ఆర్థికశాఖ పూర్తి వివరాలను సేకరించింది. పదోన్నతుల ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలి, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ఆయా శాఖలు నివేదించాయి.

53 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ఆయా శాఖలు గతంలో తేల్చగా… తాజాగా మొత్తం ఖాళీలు 55 వేలకు పైగా ఉన్నట్లు నివేదించాయి. అధికారులు అందించే నివేదికపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తారు. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశానికి నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో కేబినెట్ భేటీకి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ అమలులోకి రావటంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. స్థానికులకే ఉద్యోగాలన్నీ దక్కేలా నూతన జోనల్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది. రాష్ట్రస్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయటమే కాకుండా గ్రూప్‌-1 పోస్టులను కూడా మల్టీ జోన్‌లోనే భర్తీ చేయనున్నారు. దీంతో నూటికి నూరు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే అవకాశమున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat