ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్‌కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయింది. బాధిత కుటుంబం సహాయం కోసం మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా అర్థించింది.
వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి అయిన గంగుల కమలాకర్‌కు అనూష వివరాలు కనుక్కొని సాయం చేయాల్సిందిగా సూచించారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు బాధితురాలి వివరాలు సేకరించి ఆమెకు కావాల్సిన సహాయానికి సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ. 10 వేలు తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కేవలం ఒక్క ట్వీట్ దూరంలోనే మంత్రి కేటీఆర్ అందుబాటులో ఉండడమే కాక, సమస్యల్లో ఉన్న వారికి సాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ అబాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అనూష కుమారుడు విశ్వకు భవిష్యత్తులో అవసరమైన వైద్య సాయంతో పాటు సీఎంఆర్ఎఫ్ సాయాన్ని సైతం తొందరగా అందించి ఆ కుటుంబానికి అన్ని విదాల అండగా ఉంటామన్నారు. ప్రతీ నెల అనూష కుటుంబాన్ని ఆదుకునే విదంగా స్థానిక యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సాయానికి చలించిన అనూష వెంటనే ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌తో పాటు గంగుల కమలాకర్‌కు ధన్యవాదాలు తెలిపింది.