హుజురాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందని, కొంతమంది నేతలకు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన భేరసారాలు బయటకు పొక్కటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయ్యింది. 24గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని… సరైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించింది.
గతంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు సాగించిన ఫోటోల్ బయటకు వచ్చినా… తాను కాంగ్రెస్ లోనే ఉంటానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా తన ఆడియో కాల్ బయటకు రావటంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి… మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ్ముడు.