అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమల్ ముద్దుల తనయ శ్రుతిహాసన్ మధ్యలో సినిమాలకు కాస్త మైకేల్ కొర్లేతో బ్రేకప్ కారణంగా బ్రేక్ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బ్రేకప్ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది.
శాంతనను ఎక్కడా బాయ్‌ఫ్రెండ్ అని శ్రుతిహాసన్ చెప్పలేదు కానీ.. ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే మాత్రం ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని అనిపించేలా ఉంది. ఈ విషయాలను పక్కన పెడితే ఆదివారం తన ఇన్‌స్టా అకౌంట్‌లో అభిమానులతో శ్రుతిహాసన్ ముచ్చటించింది.
ఈ చాట్‌లో ఓ నెటిజన్ శ్రుతిహాసన్‌ను మీ ముక్కు అంటే మీకు ఇష్టమేనా? అని ప్రశ్నించగా, ‘ఓ యస్.. నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ పార్ట్‌కే’ అంటూ ఏమాత్రం తడుముకోకుండా సదరు నెటిజన్‌కు శ్రుతిహాసన్ ఇచ్చిన రిప్లయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది తెలుగులో క్రాక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శ్రుతిహాసన్, ఇప్పుడు ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది.