తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ గారు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, ZP CEO ప్రియాంక గారు, DFO ప్రవీణ గారు, కార్పొరేటర్లు వివిధ శాఖల అధికారులు ఉన్నారు..