తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది.
ఇందులో భాగంగానే శరవణన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ‘రౌడీ బేబీ’లోనూ నటించబోతోంది. అయితే, ఇందులో కాజల్ పోషించే పాత్ర కాస్త రిస్కీగా ఉంటుందని.. అయినా ఆ పాత్ర నచ్చడంతో మేకర్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమె చేయబోతున్న రిస్క్.. తల్లి పాత్రలో కనిపించనుండటమే.
చిత్ర కథ తల్లీకూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇదే కాదు నాగార్జున సినిమాలో కూడా కథానుసారం కొన్ని సన్నివేశాలలో వేశ్యగా కనిపించబోతుందని ప్రచారం అవుతోంది. మొత్తానికి కాజల్ సీనియర్ హీరోయిన్గా ఛాలెంజింగ్ రోల్స్‌కి ఒకే చెప్తూ షాకిస్తోంది. కాగా ఈమె చేయబోతున్న ‘రౌడీ బేబీ’లో రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.