Home / NATIONAL / దేశంలో 42,766 కరోనా కేసులు

దేశంలో 42,766 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు.

కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 మంది కొత్తగా కోలుకోగా, 895 మంది కరోనావల్ల మరణించారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.47 శాతమని, రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగిందని, పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉన్నదని తెలిపింది.

ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 37,60,32,586 డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో 37,23,367 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat