వరి వేదజల్లే సాగు పద్దతితో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రైతు రాయగారి శ్రీనివాస్ చెందిన వరి వెదజల్లే సాగును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుగా మారి పోలంలో వరి వేదజల్లే విత్తనాలు పోశారు. పోలం చూట్టు కలియతిరిగి మొలక వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన వేదజల్లే సాగు చేసే పద్దతి పాటిస్థే అదిక దిగుబడులు పోందవచునన్నారు.రైతుల సంక్షమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రైతును రాజును చేయడామే తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.రైతుల ఆర్థిక అబివృద్ది కోసం దేశంలో ఎక్కడలేని విధంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
గ్రామాల్లో రైతు వేధికలు ఏర్పాటు చేసిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి శీనివాస్. జడ్పీటీసీ యాదగిరి. వైస్ ఎంపీపీ రాజిరెడ్డి. కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్. డీపీవో పార్థసారధి. ఎంపీడీవో రాజేశ్ కమార్.మండల పంచాయతీ అధికారి శీనివాస్. వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్. ఎంపీటీసీ ప్రభాకర్.మండల టిఆర్ఎస్ అద్యక్షుడు వెంకటేశ్వర శర్మ.నాయకులు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.