మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ప్రేమకథల్లోనే నటించారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ నేపథ్యానికి చెందినవే! చాలాకాలంగా ఆమె ప్రేమలో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆమె అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమెకు ప్రేమ ఉండేదని, కొన్ని కారణాల వల్ల విఫలం అయిందని ఆమె తెలిపారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. తెలుగు పాటలు పాడి అలరించారు. ఆ విశేషాలు.. మీకోసం..
ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాలు?
తెలుగులో ‘18 పేజీస్’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్’ సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. తమిళంలో ‘తల్లిపోగాదే’లో నటిస్తున్నాను. శాండిల్‌వుడ్‌ను మిస్ అవుతున్నా. మలయాళంలో మూడు కథలు విన్నాను. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తా.
రియల్ లైఫ్‌లో ప్రేమలో పడ్డారా?
ఒకప్పుడు ఉండేది.. ఇప్పుడు లేదు. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. బ్రేకప్ కూడా అయింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నా.
హీరో రామ్ గురించి?
క్లోజ్ ఫ్రెండ్.
ఇష్టమైన వంట?
కేరళ వంటకం ఏదైనా ఇష్టమే. నాకు వంట కూడా వచ్చు. ‘అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. ఓనం పండుగగు అమ్మ చేసే సద్యా అంటే ఇంకా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే బిర్యానీ.
మీకు ప్రశాంతతను ఇచ్చే పని?
నేను ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటా. ఈ మఽధ్య పెయింటింగ్ మొదలుపెట్టా. బొమ్మలు వేస్తున్న సమయంలో నాకెంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి అనిపిస్తే పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తా. ఇంకా సంగీతం అంటే ప్రాణం.
ఖాళీ సమయంలో ఇంట్లో ఏం చేస్తారు.
తమ్ముడిని సతాయిస్తుంటా. కొడతా.. తిడతా.. ఇరిటేట్ చేస్తా.