తనదైన స్టైల్ లో వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు నిత్యం అండగా ఉండే రాష్ట్రంలోని మహబూబాబాద్ మునిపిపాలిటీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలి సింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుం డా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు అవ సరం. అవి సమయానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
కులం, ఆదాయం. నివాసం, పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో పాటు అవసరం ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా ఇప్పించ డానికి ఎక్కడా లేని విధంగా ఓ కొత్త కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. తొలుత పైలెట్ ప్రాజెక్టు గా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దీనికోసం తన సారధ్యంలో ప్రత్యేక బృందాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.ఎలా చేస్తారంటే.. వార్డులోని ప్రతీ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన డాటా సేకరిస్తారు. నిర్ణీత ప్రొఫార్మాలలో వివరాలు పొందుపర్చి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో దరఖాస్తులను అందజేస్తారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతీ ఒక్కరికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. జూలైలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.