తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పర్యటించారు. పట్టణంలోని 35వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చెత్తను తొలగించి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేషన్ పనులు చేపట్టాలని, మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కొరత రాకుండా.. చెట్లను విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, గద్దె నీరజ రాణి, బాలు నాయక్, గంగాధర్, గద్దె రవి, రాజశేఖర్, యాళ్ల మురళీధర్ రెడ్డి, ఇస్మాయిల్, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.