దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్నది.