కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సంజీవయ్య నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాటిన మొక్కలను వృక్షంలా నీరు పోసి పెంచాలన్నారు.
అనంతరం ఆ ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను వేరొక చోటకు బదిలీ చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, మాజీ కౌన్సిలర్లు కిషన్ రావు, సూర్యప్రభ, వార్డ్ మెంబర్ సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు మాధవరెడ్డి, కిషోర్ చారి, స్థానికులు యాదగిరి, ఉమేష్, గంగాధర్, దుర్గపతి, శ్రీనివాస్ మరియు నాయకులు లక్ష్మణ్, రమేష్ యాదవ్, బాలయ్య యాదవ్, నాగార్జున గౌడ్, ఖలీల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.