*ఉల్లిపాయలను అరగంట నీళ్లలో ఉంచి కోస్తే కళ్లు మండవు.
* కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ పోవాలంటే కీరదోస ముక్కలను మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం కల్గుతుంది.
* రాగి వస్తువులను చింతపండుతో తోమితే మెరుస్తాయి.
* ఇత్తడి చెంబులు, బిందెలు ముందు ఉప్పు నీటితో తోమి తర్వాత మామూలుగా తోమితే తళతళలాడుతాయి.
* మంచి గంధం లేదా కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి.