తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా జగన్ లేఖ రాశారు.