రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలతో కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను కూర్చిలో ఆసీనులయ్యారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అంతకుక్రితం సీఎం సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డును, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు