పీసీసీ అధ్యక్ష పదవి రాగానే రేవంత్‌కు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులకు గౌరవాన్నిచ్చేలా ఉన్నత విలువలు పాటించాలని ఎవరైనా చూస్తారు కానీ, రేవంత్ మాత్రం వాటిని దిగజార్చేలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
చిల్లర మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనవుతారని పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటికైనా లంగా.. లుచ్చా మాటలు మానుకోవాలని హితవుపలికారు. తామంతా టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేశామని ఏడాదిన్నర కిందటే చెప్పినట్టు గుర్తుచేశారు. రాళ్లతో కొట్టాలంటే ఆర్నెల్లకో పార్టీ మారిన రేవంత్‌నే ముందు కొట్టాలని పేర్కొన్నారు.