తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు.
ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకొని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌కుమార్‌తో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం భవనంలో తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.