తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో కొత్త ఫీచర్ను జతచేశారు.
బాధితులు సమస్యను వివరిస్తే.. అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. 10 రకాల సమస్యలకు చోటు కల్పించారు. మొత్తం 37 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిద్వారా 90 శాతానికిపైగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.