ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.