వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు నాటారు..వీది వీది కలియదిరుగుతూ సమస్యలు అడిగితెలుసుకున్నారు..ప్రజలనుండి వచ్చిన వినతులను స్వీకరించి అధికారులకు సమస్యల పరిష్కారించాలని సూచించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ అభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక శ్రద్ద ఉందన్నారు..పట్టణ ప్రగతి ద్వారా డివిజన్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించుకుందామన్నారు..విద్యుత్ పోల్స్,పారిశుద్యం,రోడ్లు,వాటర్ సప్లై,ఇతర సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు..
ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,సామాజిక బాద్యతగా,సమిష్టి తత్వంతో ప్రతీ ఒక్కరు అభివృద్దిలో బాగస్వామ్యులవ్వాలన్నారు.వరంగల్ ను ఆరోగ్య నగరంగా,అభివృద్ది నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ గార్లు ప్రత్యేక శ్రద్ద పెట్టి ఈ నగరాన్ని అభివృద్ది చేస్తున్నారని,ప్రజలంతా బాగస్వామ్యులై ఆరోగ్య నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దేందుకు తోడ్పాటునందించాలన్నారు..ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,అదికారులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు..