తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు చూపు వల్ల ఈ రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, తద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఏడవ విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణం, ఒడితెల, చిట్యాల, జూకల్ లో పర్యటించి ఎంపీ దయాకర్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ జక్కుల హర్షిని, అధికారులు, నేతలతో కలిసి హరిత హారంలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ”ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో హరితహారం ప్రారంభించారో.. ఆ లక్ష్యం ఫలాలు నేడు మన అనుభవంలో ఉన్నాయి.తెలంగాణలో చిన్నచిన్న పల్లెల్లో కూడా హరితహారం ఫలితం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తోంది.దళితులు ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేయి కోట్ల రూపాయలతో దళిత క్రాంతి పథకాన్ని తీసుకొస్తున్నారు.అవసరమైతే మరో 500 కోట్ల రూపాయలను అదనంగా ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు.మరికొద్ది రోజుల్లో ఈ దళిత క్రాంతి పథకం ఈ నియోజకవర్గంలోనీ దళితులందరికీ అందుబాటులోకి రానున్నది.
ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే దళిత ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావుల సలహాలు తీసుకున్నారు. ఇటీవలే ప్రతిపక్షం లోని పెద్దలు, నాయకులను కూడా ప్రగతి భవన్ కి పిలిచి, దళితుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలకు మారుపేరుగా ఉండెను. కానీ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రణాళికతో మున్సిపాలిటీలు అన్ని అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి.పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల ఆటంకం ఉండొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏటా 369 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు.
అదేవిధంగా పట్టణ ప్రగతి లో 148 మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకునేందుకు 148 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు.భూపాలపల్లి, ములుగు ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉన్న ప్రాంతాలు. కానీ కొన్ని కారణాల వల్ల నేడు అడవులు తగ్గిపోయాయి.ఈరోజు హరితహారం కార్యక్రమం లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటడం, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం ద్వారా 23 శాతంగా ఉన్న అడవులను మళ్లీ 33 శాతానికి పెంచుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో హరితహారం ద్వారా పటిష్టంగా జరుగుతోంది.అడవులు తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఏర్పడింది. ఈ స్థితి నుంచి శాశ్వతంగా బయటకు రావాలంటే మొక్కలను నాటడం సంరక్షించడమే మార్గము.మన పక్కనే ఉన్న చత్తీస్గడ్ మహారాష్ట్రల నుంచి తెలంగాణకు వచ్చేవారికి తెలంగాణ రాష్ట్రంలోని రహదారులకు ఇరువైపులా ఉండే మొక్కలను బట్టి తెలంగాణ రాష్ట్రం సరిహద్దులు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి, ఎక్కడ ముగుస్తున్నాయి అనేది సులభంగా గుర్తించగలుగుతున్నాము అని చెప్పడం మనకెంతో గర్వకారణం.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది. వ్యవసాయ రంగం, విద్యుత్ రంగం, నీటిపారుదల రంగం, ఇలా వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రగతి సాధించింది. ఇప్పుడు వైద్య, ఆరోగ్య రంగం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. బడ్జెట్లో కేటాయించిన దానికంటే అదనంగా పది వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి దీనిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు.అదేవిధంగా కూరగాయలను రోడ్ల మీద పెట్టి అమ్మే దుస్థితి ఉండకూడదని దీనినీ సమూలంగా మార్చేందుకు ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలని ఇందుకోసం 500 కోట్ల రూపాయలను కేటాయించారు.మన భూపాలపల్లిలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.మన తలాపున కాలేశ్వరం వంటి గొప్ప ప్రప్రాజెక్టును కట్టి రైతులకు మూడు పంటలకు నీరు ఇచ్చే విధంగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చారు.
అంతటితో సరిపోదనీ రైతులకు నేడు రైతు బంధు కూడా అందిస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నారు.రైతును రాజు చేయడానికి, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు.రైతులే కాదు గ్రామంలోని దళితులు కూడా సమానంగా అభివృద్ధి కావడం కోసం ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు వెళ్లి దళిత వాడలలో ఉన్న సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసిఆర్ గారు ఆదేశించారు.హరితహారం కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడే పళ్ళు, పూలు, కూరగాయల మొక్కలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశించిన లక్ష్యం నెరవేరే విధంగా మన కృషి ఉండాలి.హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన తర్వాత ఒడితెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామంలో, పట్టణంలో పర్యటించి స్థానిక అవసరాలను తెలుసుకున్నారు.