రికార్డు స్థాయి ధాన్యం మిల్లింగ్ అవకాశం కల్పించి అండగా ఉన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తామన్నారు రైస్ మిల్లర్లు, టీఆర్ఎస్ గెలిస్తేనే అభివ్రుద్ది గెలిచినట్టని, సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రైస్ మిల్లర్లు సంపూర్ణంగా టీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని వెల్లడించారు. శుక్రవారం హుజురాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని కలిసిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో కేవలం యాసంగి సీజన్లోనే 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థే సేకరించిందని, ఈ రికార్డులో రైస్ మిల్లర్ల భాగస్వామ్యం మరవలేనిదన్నారు.
ఈ ధాన్యాన్ని నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేయడంలో సహకరిస్తున్న రైస్ మిల్లర్లకు అభినందనలు తెలిపిన మంత్రి కేసీఆర్ గారి వల్లే ఇద సాధ్యమయిందని, రైస్ మిల్లర్లందరూ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని, గెలుపులో కీలక భాగస్వామ్యం ఉండాలని విజ్ణప్తి చేశారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్దించక ముందు బీడు భూములతో నెర్రెలు బారిన నెలలు, గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకునే రైతులు, కరెంట్ కష్టాలతో రైతులు పడ్డ ఇబ్బందులు మరవలేమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ దుర్గతిని రూపుమాపాలనే సంకల్పంతోనే తెలంగాణ సాదించారని గుర్తుచేశారు. ఇవాల కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కష్ట కాలంలోనూ రైతు పండించిన ప్రతీ గింజను మద్దతు దరతో కొనుగోలు చేయడమే కాక మూడు రోజుల్లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ఘనత దేశంలో తెలంగాణది మాత్రమే అని అన్నారు గంగుల. 24గంటల నాణ్యమైన కరెంట్ తో పాటు, పెట్టుబడి సాయంగా రైతు బందు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయం దిశనే మార్చేశారన్నారు.
ఐతే ఇది కంటగింపుగా చేసుకొన్న కొందరు పథకాలను పరిగెలతో పోల్చారని, పెందింట్లో కళ్యాణకాంతులు వెదజల్లే కళ్యాణలక్ష్మిని సైతం అవమానించారని వారికి బుద్ది చెప్పాలన్నారు మంత్రి గంగుల. కేసీఆర్ని ఎదురిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందనే దురాశతో ఈటెల చేసిన కుట్రలు నీచమైనవన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివ్రుద్దిని గాలికొదిలేసి స్వలాభం కోసం రాజకీయాల్ని వాడుకోవడం హేయమన్నారు. ఈటెల హయాంలో హుజురాబాద్ అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేయబడిందని, ప్రధాన రహదారులన్నీ గుంత మయం అయ్యాయని ఆవేదన చెందారు. ఈ దురవస్థను తొలిగిపోవాలంటే టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మద్దతుగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని హుజురాబాద్ని మరింత అభివ్రుద్ది చేసుకుందామని పిలుపు నిచ్చారు. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివ్రుద్ది గెలిచినట్టన్నారు మంత్రి గంగుల కమలాకర్.
సిటీ సెంట్రల్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అంతకు ముందు కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో హుజూరాబాద్ నియోజకవవర్గానికి చెందిన సీపీఐ ,కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోని యువకులు ,హమాలి నాయకులు ,మైనారిటీ నాయకులు చేరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జైతెలంగాణ, జైటీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలను వినిపించారు. కేవలం టీఆర్ఎస్ ద్వారానే అభివ్రుద్ది సాధ్యమని, కేసీఆర్ గారిలా తెలంగాణ ఆత్మతో ఉండడం, అర్థం చేసుకోవడం ఏ నాయకుడికీ లేదన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన హుజురాబాద్ని టీఆర్ఎస్ గెలుపుతో అభివ్రుద్ది దిశగా తీసుకెళ్తామని ప్రతిన భూనారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.