టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ప్రతాప్‌గిరి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్లు తదితర నిర్మాణాలు చేపడుతుందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన నిర్మాణాలు చేపడుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, స్థానిక కౌన్సిలర్ సువర్ణ, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సుభాన్ రెడ్డి, ఏఈ రాయుడు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.