ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఈయన అరెస్ట్ వెనుక గల కారణమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా రైతులు చలో రాజ్‌భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు తన మద్దుతుని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.
అలా అరెస్ట్ అయిన వారిలో నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త రైతు చట్టాల కారణంగా రైతులు కూలీలుగా మారుతున్నారని, ఆ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నారాయణ మూర్తి డిమాండ్ చేశారు.