మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా లకారం సర్కిల్లో ప్రతిష్టించి వారికి సముచిత గౌరవం కల్పించడం జరిగిందన్నారు.
పివి మన తెలంగాణ బిడ్డలు మాత్రమే కాక, యావత్ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసంస్కరణలు, ప్రధాని కాగానే ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయులు.ఆధునిక గురుకులాలు, నవోదయ విద్యాలయాలకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చిన దార్శనికులు అన్నారు.
ఆయన శత జయంతి సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏడాది పొడుగునా ఉత్సవాలు జరిపించి మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించి, వారికి సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ గారు, ట్రైనీ ఐపీఎస్ స్నేహా మెహ్రా గారు, నాయకులు RJC కృష్ణ గారు, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.