తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం.
అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.